వయసు కేవలం సంఖ్య మాత్రమే అని చాలామంది అంటారు కానీ ఇది అందరికీ వర్తించదు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు తింటుంటే చర్మం వృద్దాప్యానికి లోనవ్వదు.
క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఫేషియల్ ముఖ చర్మాన్ని సరైన రీతిలో శుభ్రం చేస్తుంది. ఫేషియల్ మాస్కులు చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు సహాయపడతాయి.
సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల బయటకు వెళ్ళినప్పుడు చర్మానికి నష్టం జరగదు. చర్మం యవ్వనంగా ఉంటుంది.
అండర్ ఐ జెల్ లేదా సీరమ్ ఉపయోగించడం వల్ల కళ్లకింద నల్లని వలయాలు, ఐ బ్యాగ్స్, కళ్ళు ఉబ్బడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
ఎన్ని పాటించినా చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా లేదంటే కొల్లాజెన్ లోపం ఏర్పడిందని అర్థం. కొల్లాజెన్ ఆహారం మీద దృష్టి పెట్టాలి.
వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. యోగా, ఈత, ఏరోబిక్, శ్వాస వ్యాయామాలు, బరువులు ఎత్తడం వంటివి శరీరాన్ని ఒకవైపు ధృడంగా ఉంచుతూ యవ్వనంగా ఉండేలా చేస్తాయి.