గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
ఛాతీ మధ్యలో ఒత్తిడిగా, ఛాతీ భాగాన్ని పిండేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది.
రెండు చేతులు, వెనుక, మెడ, దవడ లేదా కడుపులో నొప్పి లేదా అసౌకర్యం కలుగుతూ ఉంటుంది.
ఛాతీ అసౌకర్యంగా ఉండటం వల్ల శ్వాస ఆడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది.
వికారం లేదా వాంతులు, కొందరిలో కడుపునొప్పి కూడా ఎదురవుతుంది.
గుండెపోటు సమయంలో చలి వేసినట్టు ఉంటుూనే మరోవైపు చెమటలు కూడా పడుతూ ఉంటాయి.
విశ్రాంతి తీసుకున్నా సరే చాలా ఎక్కువగా అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది.
గుండెపోటు సమయంలో కొందరికి తల తిరగడం జరుగుతుంది.
ఛాతీలో ప్రారంభమయ్యే నొప్పి ఒకటి లేదా రెండు చేతులకు ముఖ్యంగా ఎడమ చేతికి వ్యాపిస్తుంది.
Related Web Stories
వేసవిలో చల్లని నీరు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
బీపీని తగ్గించే పొటాషియం అధికంగా ఉన్న ఫుడ్స్ ఇవే!
బంగాళదుంపలతో కలిగే ప్రయోజనాలు ఇవే!
రోగాలు రాకుండా ఉండాలంటే.. ఈ 4 భాగాలకు నూనె రాస్తే చాలు..