ఈ జీవుల జీవిత
కాలం చాలా తక్కువ..!
ఫ్రూట్ ఫ్లై..
కుళ్లిన పండ్లు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల చుట్టూ తిరుగుతూ కనిపించే ఫ్రూట్ ఫ్లైస్ జీవిత కాలం దాదాపు 14 రోజులు మాత్రమే.
డ్రోన్ చీమలు..
రెక్కలు, కందిరీగలా పెద్ద శరీరం కలిగిన డ్రోన్ చీమల జీవిత కాలం కేవలం 1-2 రోజులు మాత్రమే.
ఈగలు..
మన ఇళ్లలో కనిపించే ఈగల జీవిత కాలం నెల రోజుల్లో ముగుస్తుంది.
తూనీగలు..
పొలాల్లోనూ, ఆరు బయట ఎక్కువగా కనిపించే తూనీగలు ఏడు నుంచి 56 రోజులు మాత్రమే జీవిస్తాయి.
తేనెటీగలు..
తేనెటీగల జీవితకాలం సీజన్‌పై ఆధారపడి ఉంటుంది. వేసవిలో అయితే తేనెటీగలు ఆరు నెలలు బతుకుతాయి. చలికాలంలో 8 నెలల వరకు మనుగడ సాగించగలవు.
లేబర్డ్స్ ఊసరవెల్లి..
ఈ ఉసరవెల్లి కేవలం ఒక సంవత్సరం మాత్రమే బతకగలదు.
ఎలుక..
మన ఇళ్లలో తిరిగే ఎలుకల జీవిత చక్రం మూడు సంవత్సరాలలో ముగుస్తుంది.
దోమల చేపలు..
మిసిసిప్పీ నది, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతాల్లో కనిపించే దోమల చేపల జీవిత కాలం రెండు సంవత్సరాలు.
రూబీ హమ్మింగ్‌బర్డ్..
ఉత్తర, మధ్య అమెరికాలో ఎక్కువగా కనిపించే రూబీ హమ్మింగ్‌బర్డ్స్ మూడు సంవత్సరాల పాటు జీవించగలవు.
Related Web Stories
సహజమైన గులాబీ పెదవుల కోసం ఇంటి చిట్కాలు ఇవే..!
ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..
చలికాలంలో అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!
రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!