విటమిన్-సి ని అస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడం నుండి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, ఐరన్ ను గ్రహించడం వరకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది.
సిట్రస్ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలు, ద్రాక్ష వంటి వాటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
ఎరుపు, పసుపు రకాల బెల్ పెప్పర్స్ లో విటమిన్-సి మెండుగా ఉంటుంది. వీటిలో సిట్రస్ పండ్ల కంటే ఎక్కువ విటమిన్-సి ఉంటుంది.
స్ట్రాబెర్రీలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
బ్రోకలీలో పోషకాలు ఎక్కువ. విటమిన్-సి మెండుగా ఉంటుంది. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయ.
కివి లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరచడం, జీర్ణక్రియను మెరుగు పరచడంలో కివి సహాయపడుతుంది.
జామ పండ్లలో విటమిన్-సి ఎక్కువ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరచడంతో పాటూ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది.