వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!
సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటాతో జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
టమోటా జ్యూస్ లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది.
లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి టమోటాలో ఉంటాయి. ఇవి గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
టమోటాలలో సోడియం ఉంటుంది. అది ఎలక్ట్రోలైట్ లలో ఒకటి. కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు అవసరం.
బరువు తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది.
టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది.
జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల టమోటా జ్యూస్ జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.
Related Web Stories
రోజూ 15 నిముషాలు రివర్స్ వాక్ చేస్తే.. కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..
మీ జుట్టు తెల్లబడుతోందా? కారణలు ఇవే!
చింత గింజలు తింటే..!
30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!