రోజూ మీరు తినే ఆహారంలో కాల్చిన వెల్లుల్లిని చేర్చడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
కాల్చిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గుండెకు మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటూ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
వేయించిన వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్ఫన్లకు దూరంగా ఉంచుతుంది.
కాల్చిన వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగవడానికి కాల్చిన వెల్లుల్లి దోహదం చేస్తుంది. అందుకు కావాల్సిన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కేన్సర్ కణాలపై పోరాడేందుకూ వెల్లుల్లి సాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కాలేయం ఆరోగ్యకరంగా ఉండేందుకు కాల్చిన వెల్లుల్లి సాయం చేస్తుంది.