తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!
తలనొప్పి వెనుక అనేక కారణాలు ఉన్నా అతి ప్రధానంగా 6 కారణాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
విశ్రాంతి లేకుండా పనిచేయడం, అధికంగా కష్టపడటం వల్ల అలసట, ఒత్తిడి ఎదురవుతాయి. ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంది.
కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు ఎక్కువ సేపు తదేకంగా చూడటం, గంటల తరబడి వాటిముందు పనిచేయడం వల్ల కళ్లు అలసిపోతాయి. ఇది తలనొప్పికి కారణం అవుతుంది.
జీవితంలో ఆందోళన, ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తలనొప్పికి గురికావడం జరుగుతుంది.
సరైన ఆహారం తీసుకోకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటివి ఎదురవుతాయి.
ఎక్కువసేపు ఎండలో ఉండటం, సూర్యరశ్మికి గురికావడం, ఎక్కువ కాంతికి బహిర్గతం కావడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
Related Web Stories
పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!
ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మాయం
నిద్ర సరిగ్గా లేకపోతే.. ఇంత డేంజరా
స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలివే..