మెదడు ఆరోగ్యాన్ని పాడుచేసే 7 ఆహారాలు ఇవే..

మెదడు ఆరోగ్యానికి చాలా రకాల ఆహారాలను తీసుకోవచ్చు. కానీ కొన్నింటిని తీసుకోవడం వల్ల మెదడుకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవి

చక్కెర, పిండి కలిపి ప్రాసెస్ చేసిన పదార్థాలలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, తెలివితేటలను బలహీనపరుస్తాయి. 

ట్రాన్స్ ఫ్యాట్స్ మెమరీ బలహీనతకు, అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

అధిక చక్కెర తీసుకోవడం అధిక ప్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS) మెదడు వాపు, బలహీనమైన జ్ఞాపకశక్తికి మందబుద్దికి కారణం అవుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు, కణజాల క్షీణతకు, జ్ఞాపకశక్తి లోపానికి కారణం కావచ్చు.

శీతల పానీయాలు, చక్కెర రహిత ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఇందులోని కృత్రిమ స్వీటెనర్ తెలివితేటలను తగ్గించవచ్చు.

మితమైన మద్యపానం ఆరోగ్యానికి సానుకూల ప్రభావాలను కలిగిస్తుంది. అధిక వినియోగం జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుంది. 

మెర్కురీ, న్యూరోటాక్సిక్ మూలకం కారణంగా షార్క్, స్వోర్డ్ ఫిష్ వంటి చేపల కారణంగా మెదడుకు హాని ఉండవచ్చు.