ఎర్ర మిరపకాయలను తీసుకోవడం వల్ల కలిగే 7 దుష్ప్రభావాలు ఇవే..

ఎర్ర మిరపకాయలను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే కలిగే ఇబ్బందులకన్నా, కొద్దిమొత్తంలో తీసుకోడం మంచిది. 

మిరపకాయలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నెమ్మదిగా స్పైసీ ఎఫెక్ట్‌కి అలవాటు పడతారు.

జీర్ణ సమస్యలు ఎర్ర మిరపకాయలను మరీ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కడుపు నొప్పి, తిమ్మిరి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 

మిరపలో క్యాప్సైసిన్ కడుపులోని పొరను చికాకు పెడుతుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిప్లక్స్‌ను పెంచుతుంది. 

మరీ కారం ఎక్కువైతే నోరు, గొంతులో మంట, చికాకు ఏర్పడతాయి. అసౌకర్యం పెరుగుతుంది.

మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

ఎర్ర మిరపకాయలు చర్మం, చికాకు లేదా మంట స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది.

అతిగా మిరపకాయలు తీవడం వల్ల అతిసారం, జీర్ణ సమస్యలు వస్తాయి.