చాలా మందిని వేధించే అధిక రక్తపోటు సమస్యకు ఆయుర్వేదం చెప్పిన సూపర్ టిప్స్ ఇవి.
దనియాలు, జీలకర్ర, చిటికెడు పసుపు వేసి పెసరపప్పు ఉడికించి పెసరకట్టు తయారుచేసుకుని తాగాలి. దీన్ని అన్నంతో కూడా తినచ్చు.
తాజాగా తీసిన పీచ్ పండు రసంలో స్పూన్ దనియాల పొడి, ఒక ఏలకుల పొడి జోడించాలి. దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి.
వేడి నీటిలో ఒక స్పూన్ తేనె, 5 నుండి 10 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ జోడించాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.
తాజా ఆరెంజ్ జ్యూస్, కొబ్బరి నీళ్లను ఒకటికి రెండు నిష్పత్తిలో కలిపి తాగాలి.
దోసకాయతో రైతా చేసుకుని తీసుకుంటే జీర్ణక్రియతో పాటూ రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
చిటికెడు ఏలకుల పొడి, దనియాల పొడితో పుచ్చకాయ ముక్కలు తిన్నా అధికరక్తపోటు తగ్గుతుంది.
Related Web Stories
పుచ్చకాయ గింజలతో పురుషులకు ఇన్ని ప్రయోజనాలా!
కీళ్లనొప్పులను సులువుగా తగ్గించే 10 డ్రింక్స్!
ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఫుడ్స్ తినండి
ఎండాకాలంలో మెంతికూర తింటే..?