ఎర్ర కందిపప్పు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
వంటల్లో సాధారణ కందిపప్పుకు బదులు ఎర్రకందిపప్పు వాడితే అద్బుతమైన ఆరోగ్య ఫలితాలుంటాయి.
ఎర్రకందిప్పు మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్. దీన్ని ప్రోటీన్లకు పవర్ హౌస్ అనడంలో సందేహమే లేదు.
డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం మూలాన జీర్ణాశయ ఆరో్గ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఎర్ర కందిపప్పులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఐరన్ లోపంతో ఇబ్బందిపడుతున్నవారు సాధారణ కందిపప్పుకు బదులు దీన్ని వాడితే మంచిది.
అధిక శాతం ఫోలెట్, పొటాషియం ఉన్న కారణంగా ఎర్ర కందిపప్పు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
ప్రోటీన్, పైబర్ రెండూ పుష్కలంగా ఉండటం మూలాన ఇది కడుపు నిండిన ఫీల్ ను ఇస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
ఎర్రకందిపప్పులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారం నుండి చక్కెరను చాలా నెమ్మదిగా రిలీజ్ చేసేలా చేసి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం మూలాన ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
మలబద్దకంతో ఇబ్బంది పడేవారికి కూడా ఎర్రకందిపప్పు దివ్యౌషదం. ఇది ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేసి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.