వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?
వర్షాకాలం ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వస్తాయి. ఈ సీజన్ లో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
రోజూ తులసి టీ తాగుతూ ఉంటే జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఉంటుంది.
వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అదే తులసి టీ టీ తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.
తులసిలో ఉండే సమ్మేళనాలు ఒత్తిడి, ఆందోళన తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.
తులసి టీని రోజూ తాగితే వర్షాకాలంలో చర్మ వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
తులసి టీలో ఉండే గుణాలు కీళ్ళ నొప్పులు, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
వర్షాకాలంలో ఎదురయ్యే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో తులసి టీ సహాయపడుతుంది.
Related Web Stories
మగవారికి బట్టతల ఎందుకొస్తుందో తెలుసా..?
ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయొచ్చు!?
పియర్స్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
యాపిల్ గింజలు తిన్నారో.. ఇక అంతే సంగతులు..!!