పరగడుపునే ఇంగువ  నీరు తాగితే ఎన్ని లాభాలంటే..!

విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు ఇంగువలో పుష్కలంగా ఉంటాయి.

ఇంగువనీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. 

ఇన్ఫెక్షన్ సమస్యలు దూరంగా ఉంచడంలో ఇంగువ నీరు తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది.

 ఇంగువలో ఉండే లక్షణాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడతాయి.

మలబద్దకం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఇంగువ నీరు తాగితే ఉపశమనం ఉంటుంది.