రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!

ఏలకులు ఆహారంలో రుచిని, సువాసనను పెంచడమే కాదు..  ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తాయి. ఏలకుల నీరు తాగితే ఈ కింది ప్రయోజనాలుంటాయి.

ఏలకుల నీరు కళ్లను చల్లబరుస్తుంది.  కళ్ల చికాకు, దురద తగ్గించడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది.

అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గించడంలో ఏలకుల నీరు బాగా పనిచేస్తాయి.  పేగు ఆరోగ్యాన్ని కాపాడి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఏలకులలో మంచి  మొత్తంలో పీచు ఉంటుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఏలకులు కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మం చికాకు,  మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

ఏలకుల నీరు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శరీరం శుద్ది అవుతుంది.

ఏలకుల నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. నోటి ఆరోగ్యం బాగుంటుంది.