వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..

వెల్లుల్లి నీరు శరీరాన్ని శుద్ది చేస్తుంది.  శరీరంలో ఉండే వ్యర్థాలు,  ఎక్కువ మొత్తంలో ఉన్న ఖనిజాలను తొలగించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి నీరు తాగితే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు  తగ్గుతాయి.  ఇది అథెరోస్క్లెరోసిస్ ను నిరోధించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జలుబు నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

వాపులు, మంటలు తగ్గించి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి నీరు సహాయపడుతుంది.

వెల్లుల్లి నీటిని తాగుతూ ఉంటే ఎముకల ఆరోగ్యం దృఢంగా ఉంటుంది.  బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శారీరక శ్రమ ఎక్కువ చేసేవారికి ఎదురయ్యే అలసటను తగ్గించడంలో వెల్లుల్లి నీరు సహాయపడుతుంది.

వెల్లుల్లి నీరు రక్తనాళాలలను సడలించడంలో సహాయపడుతుంది.  రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది.