ఉసిరికాయ రసాన్ని నెల రోజులు ఖాళీ కడుపుతో తాగితే ఏమవుతుంది?

ఉసిరిలో విటమిన్-సి,ఎ,బి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉసిరికాయ రసాన్ని నెల రోజులు ఖాళీ కడుపుతో తాగితే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.

ఉసిరి రసంలో డైటరీ ఫైబర్ ఉంటుంది.  ఇది పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది.  శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

ఉసిరి రసం 30 రోజులు తీసుకుంటే అతిగా తినడం అనే సమస్య తగ్గిపోతుంది.

వరుసగా 30రోజులు ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఫైబర్ పుష్కలంగా ఉన్న ఉసిరికాయ జ్యూస్ ను నెలరోజులు తీసుకుంటే మలబద్దకం,  అజీర్ణం,   కడుపులో గ్యాస్ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

ఉసిరికాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. నెలరోజులు తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.