రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!
వర్షాకాలంలో గాలిలో తేమ పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ లు విజృంభిస్తాయి. వీటి నుండి రక్షణ కావాలంటే బెల్లం టీ మంచి ఎంపిక.
బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రిస్తుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
భోజనం తరువాత ఓ కప్పు బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. బెల్లంలో సహజ ఎంజైమ్ లు జీర్ణక్రియకు సహాయపడతాయి.
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బెల్లం రక్తాన్ని శుద్ది చేస్తుంది. బెల్లం టీ తాగుతూ ఉంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
చక్కెర కలిపిన టీ తాగితే ముఖం మీద మొటిమలు, బ్లాక్ హెడ్స్ వస్తాయి. అదే బెల్లం టీ తాగితే ఈ సమస్యలు ఉండవు.
బెల్లం టీ సాధారణ సీజనల్ సమస్యలు అయిన దగ్గు, జలుబు లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా
చక్కెర తినడం మానేస్తే ఇన్ని ప్రయోజనాలున్నాయా?
భోజనం చేశాక 100 అడుగులు నడిస్తే.. ఏమతుందంటే..
మీ చెయ్యి ఇలా అవుతోందా? హార్ట్ ఎటాక్ కావచ్చు జాగ్రత్త!