అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

అవకాడో విదేశాలకు చెందిన పండు. దీన్ని చాలావరకు శాండ్విచ్ లలోనూ, సలాడ్ లలోనూ ఉపయోగిస్తుంటారు.

అవకాడో ఖరీదు ఎక్కువే కానీ ఇది చేకూర్చే ప్రయోజనాలు మాత్రం షాకింగ్ గా ఉంటాయి.

అవకాడో లో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.  ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు.  ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

అపకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో,   బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అవకాడోలో విటమిన్లు,  పొటాషియం ఉంటాయి.  ఇవి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు,  యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

అవకాడోలో ఉండే ఫైబర్,  ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి.  ఇవి బరువును తగ్గించడం ద్వారా ఊబకాయానికి చెక్ పెడతాయి.

అవకాడో లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇది శరీరంలో వాపులు, నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది.