మెంతి మొలకలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

సాధారణంగా పెసలు,  శనగలు మొలకల రూపంలో తీసుకుంటూ ఉంటారు. కానీ మెంతి మొలకలు తింటే వీటికి మించి లాభాలు కలుగుతాయి.

మెంతి మొలకలలో బయోయాక్టీవ్ సమ్మేళనాలు ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో మెంతి మొలకలు సహాయపడతాయి. మధుమేహం ఉన్న వారికి ఇవి చాలా మంచివి.

పొటాషియం,  ఐరన్,  విటమిన్-సి,  విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి.  ఇవి మొత్తం ఆరోగ్యానికి మంచివి.

మెంతి మొలకలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి.   ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మెంతి మొలకలు తీసుకుంటే ప్రేగులు ఆరోగ్యంగా ఉంచడంలో,  మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

మెంతి మొలకలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ సేపు ఆకలిని  నియంత్రిస్తుంది.  ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.