శనగలు, బెల్లం.. ఈ సూపర్ కాంబినేషన్ తింటే కలిగే లాభాలివీ..!
వేయించిన శనగలను బెల్లం పాకంలో వేసి స్నాక్ గా తింటుంటారు. చలికాలానికి ఇవి బెస్ట్ సూపర్ ఫుడ్.
బెల్లంతో కూడిన శనగలలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఇది కండరాలను మరమ్మత్తు చేస్తుంది. కండర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
బెల్లం శనగలలో పైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను ప్రోత్సహించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బెల్లంలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి శక్తిని ఇస్తాయి. సత్తువలేని శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి.
బెల్లం, శనగలు రెండింటిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని నివారించడానికి, మెరుగైన రక్తప్రసరణ కోసం ఇది బాగా సహాయపడుతుంది.
ఫోలెట్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయి. పిల్లలకు ఎంతో మంచిది.
బెల్లంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి.
ప్రోటీన్, ఫైబర్ రెండూ సమృద్దిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. మధుమేహాం ఉన్నవారికి మంచిది.
బెల్లం, శనగలు తింటే చాలాసేపటి వరకు ఆకలివేయదు. దీని కారణంగా బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.