పైనాపిల్ తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.

పైనాపిల్  లో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని  బలపరుస్తుంది.  తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి మంచిది.

బ్రోమెలైన్ అనే ఎంజైమ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

తక్కువ కేలరీలు,  ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల పైనాపిల్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉంటాయి.  ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా,  కాంతివంతంగా ఉంచుతాయి.

పైనాపిల్ లో ఎముకల పటిష్టతకు అవసరమైన మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు, మరమ్మత్తుకు సహాయపడుతుంది.

పైనాపిల్ లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇది నెమ్మదిగా గ్రహించబడుతుంది.