గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

 గులాబీ రేకులు జీర్ణ ఎంజైమ్ లను  ఉత్తేజపరుస్తాయి.  జీర్ణశక్తి బలంగా ఉంచుతాయి.

గులాబీ రేకులలో విటమిన్లు,  యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ బ్యాక్టీరియల్  గుణాలు గులాబీ రేకుల్లో పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

గులాబీ రేకుల్లో సహజమైన నొప్పి నివారణ గుణాలు ఉన్నాయి.  ఇవి నెలసరి తిమ్మిర్లు,  అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

గులాబీ రేకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

గులాబీ రేకులలో ఉండే సమ్మేళనాలు ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి.

గులాబీ రేకులు తింటే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.  గుండె ఆరోగ్యానికి  మంచిది.