రోజూ నానబెట్టిన పెసరపప్పు తింటే ఏం జరుగుతుందంటే.. !

నానబెట్టిన పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంచుతుంది, మలబద్దకం తగ్గిస్తుంది.

పెసరపప్పులో మెగ్నీషియం, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నానబెట్టిన పెసరపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. తక్కువ కేలరీలు. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల నానబెట్టిన పెసరపప్పు తింటే  రోగనిరోధక శక్తి బలపడుతుంది.

నానబెట్టిన పెసరపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా నానబెట్టిన పెసరపప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  మధుమేహం ఉన్న వారికి చాలా మంచిది.

నానబెట్టిన పెసరపప్పులో విటమిన్ - సి, ఇ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మంచివి.

కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల నానబెట్టిన పెసరపప్పు తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి రాదు.