ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
ఆరోగ్యకరమైన జీవితానికి ఆవిరిమీద ఉడికించిన ఆహారాలు గొప్ప ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ఆవిరి మీద ఉడికించిన ఆహారంలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, పోషకాల నష్టం జరగదు.
ఆహారం రంగు, నీటిశాతం చెక్కుచెదరు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఆవిరిమీద ఉడికించిన కూరగాయలు, ఇతర పదార్థాలలో రుచి తగ్గదు.
ఆహారాన్ని ఆవిరిమీద ఉడికిస్తే అందులో ఫైబర్ మృదువుగా మారి రుచికరంగానూ, సులువుగా జీర్ణమయ్యేలానూ మారుతుంది.
ఆవిరిమీద ఆహారం ఉడికించడానికి నూనెలు ఏవీ అక్కర్లేదు. కాబట్టి ఈ ఆహారం చాలా తేలికగా ఉంటుంది.
తక్కువ సమయంలోనే ఆవిరిమీద వంట పూర్తవుతుంది. . కేవలం 30నిమిషాల సమయం సరిపోతుంది.
స్థిరంగా ఉన్న మంట మీద ఆహారం ఉడుకుతుంది కాబట్టి దీనికి ఇతర వంటతో పోలిస్తే గ్యాస్, డబ్బు ఆదా అయినట్టే.
ఆవిరిమీద ఉడికించే ఆహారం వల్ల వంటగది శుభ్రంగా ఉంటుంది.