రాగులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదిదే..!
రాగులలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలుంచాయి.
గ్లూటెన్ లేకపోవడం వల్ల ఇది ఉదరకుహుర వ్యాధి, గ్లూటెన్ గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి మంచిది.
రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది.
రాగులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేలా చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.
ఫైబర్ అధికంగానూ, కేలరీలు తక్కువగానూ ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
రాగులలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
రాగులలో ఉండే పాలీఫెనాల్స్ గొప్ప యాంటీఆక్సిడెట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.