ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా  తగ్గిపోతుంది..

నారింజ.. విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా  ఉండటం వల్ల నారింజ రసం చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.  గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

దానిమ్మ రసం.. ఇందులో బ్లడ్ ప్రెజర్,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

సోయా పాలు.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సోయా పాలు సహాయపడతాయి.

క్రాన్బెర్రీ జ్యూస్.. ఆరోగ్యకరమైన కొవ్వులు పెంచడంలోనూ,  చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ  ఇది సహాయపడుతుంది.

గ్రీన్ టీ.. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బీట్రూట్ జ్యూస్.. రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  గుండె ఆరోగ్యం బాగుంటుంది.

కొబ్బరి నీరు.. కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.