Tilted Brush Stroke

నెల రోజుల పాటు చక్కెర మానేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలుంటాయి.

చక్కెర నోటికి రుచి ఇస్తుంది కానీ శరీరాన్ని ఆరోగ్య సమస్యల నిలయంగా మారుస్తుంది.

నెలరోజులు చక్కెర మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా అదుపులోకి వస్తాయి. మధుమేహ ప్రమాదం తప్పుతుంది.

చక్కెర లేని ఆహారం  తీసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 దంతాలు, చిగుళ్ల  సమస్యలు  ఉంటే అవి పూర్తీగా తగ్గిపోతాయి.

చక్కెర శరీరంలో శక్తిని తగ్గిస్తుంది. దీన్ని తినడం మానేస్తే అలసట, నీరసం వంటి సమస్యలు తగ్గిపోతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

 చర్మసంబంధ సమస్యలు, చికాకులు, మొటిమలు తగ్గిపోతాయి.

క్యాన్సర్  కారకాలను, ఫ్రీరాడికల్స్ ను చక్కెర ప్రోత్సహిస్తుంది. దీన్ని తినడం ఆపితే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

చక్కెరకు ప్రత్యామ్నాయంగా సహజమైన తీపిని కలిగిన తేనె, ఖర్జూరం, ఎండుద్రాక్ష, స్టీవియా వంటి తీపి పదార్థాలు ఎంచుకోవచ్చు.