ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఏం జరుగుతుందంటే..!
రాత్రంతా నిద్రపోయి లేవడం వల్ల శరీరంలో తేమ కొరత ఉంటుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీరం రీహైడ్రేట్ అవుతుంది. గోరు వెచ్చని నీటితో జీవక్రియ ప్రారంభమవుతుంది.
గోరువెచ్చని నీరు ఆహార కణాలను విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను ప్రేరేపిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఆహారం కదలికలను సులభతరం చేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
శరీరంలో టాక్సిన్లను, వ్యర్థపదార్థాలను బయటకు పంపడంలో గోరువెచ్చని నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాలు, కాలేయం పనితీరుకు మద్దతు ఇస్తుంది.
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు బర్న్ చేయడంలో , బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పేగుల కదలికలను ప్రోత్సహించి పేగులలో మలాన్ని మృదువుగా చేయడంలో గోరువెచ్చని నీరు సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యం మెరుగుపరుస్తుంది.