రోజ్మేరీ టీ లో యాంటీఆక్సిడెంట్లు రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వ్యాధి ప్రమాదాలు తగ్గిస్తాయి.
జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా రోజ్మేరరీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు క్లియర్ చేస్తుంది.
రోజ్మేరీ టీ తాగితే ఏకాగ్రత, దృష్టి, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది.
రోజ్మేరీ లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపును తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, కండరాల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తాయి.
విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల రోజ్మేరీ టీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
రోజ్మేరీ టీ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
రక్తప్రసరణను మెరుగుపరచడంలో రోజ్మేరీ సహాయపడుతుంది. రేనాడ్స్ వ్యాధి లక్షణాలు తగ్గిస్తుంది.
శ్వాసకోశ సమస్యలున్న వారు రోజ్మేరీ టీ తాగితే గొంతు ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు సమయంలో కూడా శ్వాస ఫ్రీ గా ఉండేలా చేస్తుంది.