భోజనం తరువాత ఓ చిన్నముక్క బెల్లం తింటే ఏం జరుగుతుందంటే..!
జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిస్తుంది.
బెల్లంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. భోజనం తరువాత తీపి తినాలనిపించే వారికి బెల్లం ముక్క తింటే తృప్తిగా ఉంటుంది.
బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ సూచి తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపం, అనీమియా వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మంచిది.
బెల్లం శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
సెలీనియం, జింక్ తో సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు బెల్లంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి.