పిల్లలు ఉదయాన్నే  నిద్రలేస్తే కలిగే లాభాలు ఇవే..

పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే మార్నింగ్ డ్రింక్,  అల్పాహారం అస్సలు మిస్ కారు. పిల్లలు ఎదుగుదల బాగుంటుంది.

పొద్దున్నే నిద్ర లేచే పిల్లల మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. 

రాత్రి తొందరగా పడుకోవడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలలో ఏకాగ్రతను,  జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  

త్వరగా నిద్రపోవడం, త్వరగా లేవడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంటారు.

 ఉదయాన్నే నిద్రలేచే పిల్లలు సమయానికి పనులన్నీ పూర్తీచేసుకోగలుగుతారు. 

ఉదయం నిద్ర లేస్తే పిల్లలకు కూడా వ్యాయామం చేసే సమయం ఉంటుంది. 

జీవనశైలి దెబ్బతినడం వల్ల వచ్చే ఊబకాయం, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధుల ప్రమాదం తప్పుతుంది.

ఉదయాన్నే నిద్ర లేచే పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారు.