కోడి గుడ్లు అతిగా  తింటే కలిగే నష్టాలు ఇవే..

 కోడి గుడ్లు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అధికంగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

 గుడ్లు అతిగా తింటే బరువు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలున్నాయి.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తీసుకుంటే సమస్యలు వస్తాయి.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గుడ్లు తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కోడి గుడ్లు ఎక్కువగా తింటే రక్తం సరఫరా చేసే ధమనులు మూసుకుపోయే ప్రమాదం ఉంది.

అతిగా తినే వారికి మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.

రోజుకు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ కోడి గుడ్లు తినాలంటే డైటీషియన్ల సలహా తీసుకోవాలి.

అనారోగ్య సమస్యలుంటే అతిగా కోడి గుడ్ల తినే విషయంలో డైటీషియన్ల సూచనలు తప్పనిసరి.