చాలామంది ఎముకలు, కండరాల ఆరోగ్యం మీదే దృష్టి పెడతారు. వాటికి తగిన ఆహారం తింటుంటారు.
ఒత్తిడి, పేలవమైన ఆహారపు అలవాట్లు, శారీరక దృఢత్వం పై శ్రద్ద లేకపోవడం, పోషకాల కొరత కారణంగా నరాలు బలహీనంగా మారతాయి. నాడీ వ్యవస్థను బలంగా ఉంచే ఆహారం తీసుకోవాలి
బెర్రీలు..
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న బెర్రీలు నరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ఆకుపచ్చ కూరగాయలు..ఖనిజాలు, విటమిన్లు, మెగ్నీషియం సమృద్దిగా ఉన్న ఆకుపచ్చ కూరగాయలు నరాలను బలోపేతం చేస్తాయి.
గింజలు..
నరాలు బలంగా ఉండాలంటే బాదం, జీడిపప్పు, వాల్ నట్, పిస్తా తదితర గింజలు తీసుకోవాలి.
చేపలు..
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
దానిమ్మ..
రోజూ ఒక దానిమ్మ పండు తింటూ ఉంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
సిట్రస్ పండ్లు..సిట్రస్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సిరల్లో నొప్పి, వాపును తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క..
బలహీనమైన నరాలను బలోపేతం చేయడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది.
బ్రౌన్ రైస్..
బ్రౌన్ రైస్, ఓట్ మీల్ తీసుకోవడం వల్ల చాలా బలహీనంగా మారిన సిరలు కూడా పునరుజ్జీవం పొందుతాయి.