జామ ఆకులు నమిలితే..  కలిగే ప్రయోజనాలు ఇవే.. 

జామ ఆకుల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి

జామ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను రెగ్యులేట్ చేయగలవు. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రోజూ జామ ఆకులను నమలడం ఎంతో మంచిది. 

జామ ఆకులు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

జామ ఆకులు జీర్ణ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయి. అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

జామ ఆకులు కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడతాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

జామ ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. నోటిలోని హానికర బ్యాక్టీరియాను జామ ఆకులు దూరం చేస్తాయి. 

ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చే వ్యాధుల నుంచి జామ ఆకులు రక్షణ కల్పిస్తాయి. అలాగే యాంటీ-ఏజింగ్‌గా కూడా పని చేస్తాయి. 

జామ ఆకులను నేరుగా నమిలినా లేదా నీటిలో మరిగించుకుని తాగినా ఆరోగ్యం మెరుగుపడుతుంది.