రోజూ నానబెట్టిన బాదం తింటే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా? 

బాదం గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ-కేన్సర్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది.. 

బాదం పప్పుల్లో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

నానబెట్టడం వల్ల బాదం గింజల్లోని భాస్వరం, కాల్షియం వంటి కొన్ని ఖనిజాలు మీ శరీరం గ్రహించడానికి అనువుగా మారతాయి. 

ఉదయాన్నే బాదం పప్పులు తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది.

బాదం పప్పులో నీటిలో కరిగే ఫైబర్ ఉండడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 

నానబెట్టిన బాదం గింజల్లో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో కొలస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తాయి. 

నానబెట్టిన బాదం గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి. 

జుట్టు సంరక్షణకు, పెరుగుదలకు బాదం తినడం చాలా మేలు చేస్తుంది. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్-ఈని శరీరం సులభంగా శోషణం చేసుకుంటుంది. 

బాదం పప్పులో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మ సంరక్షణకు ఎంతోగానో ఉపయోగపడుతుంది.