పీనట్ బటర్‌.. ఆరోగ్యానికి  ఇంత మేలు చేస్తుందా..

వేరు శెనగలో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 

పీనట్ బటర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. కండరాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

వేరుశెనగ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. 

 పీనట్ బటర్‌ను దేనితో కలిపి తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

 ఇది చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వేరు శెనగలో రెస్వెరాట్రాల్ సహా పలు యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. 

పీనట్ బటర్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది. 

పీనట్ బటర్‌లోని ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల కలయిక నిరంతరం శక్తిని విడుదల చేస్తుంది. 

దీనిని వ్యాయామానికి ముందు లేదా మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకుంటే మంచిది.