త్రిఫల జ్యూస్ పవరేంటో తెలుసా? దీన్ని ఖాళీ కడుపుతో తాగితే జరిగేదిదే..!
ఆయుర్వేదంలో త్రిఫల జ్యూస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చూర్ణం, జ్యూస్.. రెండువిధాలుగా అందుబాటులో ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగితే జరిగేదిదే..
త్రిఫల జ్యూస్ సహజమైన డిటాక్స్ డ్రింక్. ఖాళీ కడుపుతో తాగితే శరీరాన్ని శుద్దిచేస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు త్రిఫల చూర్ణంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
జీర్ణరసాలు, ఎంజైమ్ లను ప్రేరేపించడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిస్తుంది.
త్రిఫల నీరు క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో కొవ్వు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడంలో దోహదపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల త్రిఫల చూర్ణం రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
త్రిఫలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
త్రిఫలను రోజూ తీసుకుంటే సీజనల్ సమస్యలు దరిచేరవు.
Related Web Stories
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 7 ఫుడ్స్ తినాల్సిందే!
రోజూ రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే.. కలిగే లాభాలివే..!
వంకాయను ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదు..!
రోజూ వేపాకులు తింటే.. ఈ 8 లాభాలు గ్యారెంటీ...