ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి ఇవే అసలు కారణాలు..!

మద్యపానం ఎక్కువగా తీసుకునే వారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. కాలేయ కణాలను విషపూరితం చేసే  అసిటాల్ఢిహైడ్ ను ఉత్పత్తి చేస్తుంది.

కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్ చేయబడిన ఆహారం బరువు పెరగడానికి, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

అధికంగా చక్కెర ఉన్న పానీయాలు, సోడాలు, పండ్ల రసాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతతో ముడి పడి ఉంటుంది.

శారీరక శ్రమ లేకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య  వస్తుంది.  దీర్ఘకాలం ఇది కొనసాగితే సమస్య పెరుగుతుంది.

వేపుళ్లు, కాల్చిన ఆహారాలు, వనస్పత్తి లో ఉండే ట్రాన్స్ కొవ్వులు ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమవుతాయి.

ఆహారాన్ని మెయింటైన్ చేయకపోవడం,  సరైన సమయానికి తినకపోవడం జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది.  ఇది ఫ్యాటీ లివర్ కు దారితీస్తుంది.

యాంటిడిప్రెసెంట్స్,  కార్టికోస్టెరాయిడ్స్ తో సహా కొన్ని మందులను ఎక్కువగా వాడితే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి.

వైట్ బ్రెడ్, కేకులు, మైదా ఆధారిత ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. తక్కువ పోషకవిలువలు అందిస్తాయి.  ఇది ఇన్సులిన్ నిరోధకతకు,  ఫ్యాటీ లివర్ కు  దారితీస్తుంది.

సరిగా నిద్రపోని వారిలో జీవక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. కాలేయంలో కొవ్వులు పేరుకుపోతాయి.  ఇది  ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది.