బట్టతల  రావడానికి ఇవే కారణమా..!

 బట్టతల రావడానికి వంశపారంపర్యంగా వస్తున్న జన్యువులు మూల కారణం కావచ్చు.

ఈ ఆధునిక కాలంలో ఎదుర్కొనే ఒత్తిడి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.

కొన్ని మందుల దుష్ర్పభావాల వల్ల కూడా బట్టతల వస్తుంది. 

 రకరకాల రసాయనాలు ఉపయోగించడం, జుట్టును టైట్‌గా బిగించి పోనీ టెయిల్ వేసుకోవడం మొదలైన వాటి వల్ల జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి.

ఐరన్, విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు తగినంతగా తీసుకోకపోవడం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.

మహిళల్లో మోనోపాజ్, గర్భం లేదా ప్రసవ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.

థైరాయిడ్, కేన్సర్ కోసం తీసుకునే కీమోథెరపీ, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు కూడా బట్టతలకు కారణమవుతాయి.