సరైన నిద్రకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

రాత్రి నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. నిద్ర సరిగా రాకపోతే ఉదయం ఏ పనిని సరిగా చేయలేం.

ప్రతి ఒక్కరికీ 7 గంటల నిద్ర ఉండాలి. అయితే ఇప్పటి పిల్లలు, పెద్దల్లో కనీసం కావాల్సిన నిద్ర కూడా నిద్రపోవడం లేదు.

ఇలా నిద్రపోని వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం వరకూ ఉంటుంది. 

నిద్రపోవడానికి సరైన సమయం రాత్రి 10 నుంచి 11 గంటలు.. ఈ మధ్యలో రాత్రి నిద్ర నిద్రపోవాలి. 

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్రలేమి సమస్య కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

నిద్రపోవడానికి గంట, అరగంట ముందు ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగించరాదు.