సెలెబ్రిటీలు ఇష్టంగా చేసే ఐస్ బాత్ గురించి షాకింగ్ నిజాలివీ..!

విరాట్ కోహ్లి, విద్యుత్ జమ్వాల్, రకుల్ ప్రీత్, సమంత తో సహా ఎంతో మంది సెలెబ్రిటీలు ఐస్ బాత్ చెయ్యడానికి ఇష్టపడతారు. దీని వెనుక నిజాలు తెలిస్తే షాకవుతారు.

చల్లని నీరు నాడీ వ్యవస్థ, ఒత్తిడి హార్మోన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మానసిక స్థితి, శక్తిస్థాయిలను మెరుగుపరుస్తుంది.

చల్లని నీరు శరీరంలో ఉండే కొవ్వును సక్రియం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఐస్ బాత్ థెరపీ రక్త ప్రసరణను పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అధికంగా వ్యాయామం చేసిన తరువాత ఐస్ బాత్ చేస్తే కండరాల నొప్పి, వాపు ఈజీగా తగ్గుతాయి.

ఐస్ బాత్ చేయడం వల్ల పారాసింపథెటిక్ నాడీవ్యవస్థ సక్రియం అవుతుంది.  రాత్రి సమయంలో మంచి నిద్ర వస్తుంది.