మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..

శీతాకాలం సీజన్ లో దొరికే పండ్లలో సీతాఫలం ముఖ్యమైనది.

సహజంగా పండిన సీతాఫలాలు తియ్యగా,  మధురమైన రుచితో అధ్బుతంగా ఉంటాయి.

సీతాఫలం రుచికే కాదు.. ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.

సీతాఫలాలలో సహజ చక్కెరలు ఉంటాయి.  ఇవి శరారనికి శక్తిని ఇస్తాయి.

సీతాఫలాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది జీర్ణ సమస్యలు తొలగిస్తుంది.

సీతాఫలాలలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.  ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి.

సీతాఫలాలు తింటే లుటిన్ పుష్కలంగా అందుతుంది.  ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

సీతాఫలాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం.. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

సీతాఫలాలను పరిమితంగా తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి.