ఆరోగ్యానికి మంచిది కదా అని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!
బరువు మైంటైన్ చేయడం నుండి శరీరంలో బోలెడు విధులకోసం ప్రోటీన్ అవసరం. అయితే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే శరీరంపై దుష్ఫ్రభావాలుంటాయి.
శరీరంలో ప్రోటీన్ బాగా జీర్ణం కావడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఈ కారణంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. తలనొప్పి, అలసట వస్తాయి.
కేలరీలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం నుండి ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బరువు పెరుగుతారు.
శరీరంలో ప్రోటీన్ విచ్చిన్నమైనప్పుడు అమ్మోనియా విడుదల అవుతుంది. ఇది నోటి దుర్వాసన, చెడు శ్వాసకు కారణమవుతుంది.
ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు, మూత్రపిండాల ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి.
ఎక్కువ ప్రోటీన్ జీర్ణం కావడానికి జీర్ణ ఎంజైమ్ లు అవసరం అవుతాయి. ఇవి జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సస్యలను కలిగిస్తాయి.
అధిక ప్రోటీన్ జీర్ణం కావడంలో భాగంగా కాలేయం ఒత్తిడికి గురవుతుంది. ఇది కాలేయ పనితీరు దెబ్బతినేలా చేస్తుంది.
జంతుమూలాల నుండి లభ్యమయ్యే ప్రోటీన్ ను అధికంగా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్ ప్రమాదాలు పెరుగుతాయి.
అధిక ప్రోటీన్ ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం కాల్షియం వంటి ఇతర పోషకాలతో అసమతుల్యతకు లోనవుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.