అనీమియా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!
రక్తహీనత కారణంగా మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల తరచుగా తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
రక్తహీనత ఉన్నవారిలో విపరీతమైన అలసట, శరీరంలో శక్తి లేనట్టు ఉంటుంది.
చర్మం రంగు పాలిపోయి ఉంటుంది. ముఖ్యంగా అరచేతులు, కనురెప్పల లోపలిభాగం, పెదవులపై చర్మం పాలిపోయి ఉంటుంది.
రక్తహీనత ఉన్నవారిలో శ్వాస తీసుకవడంలో ఇబ్బంది ఉంటుంది. ఏ చిన్న పని చేసినా త్వరగా ఆయాసపడతారు.
గోర్లు. జుట్టు పెళుసుగా ఉంటాయి. గోర్లు విరిగిపోవడం, జుట్టు తెగిపోవడం లేదా పలుచగా మారడం, జుట్టు రాగి రంగులోకి మారడం వంటివి జరుగుతాయి.
పాదాలు, చేతులలో రక్తప్రసరణ తగ్గడం వల్ల కొందరిలో పాదాలు, చేతులు చాలా చల్లగా ఉంటాయి.
రక్తప్రసరణ లేకపోవడం వల్ల కాళ్లలో జలధరింపు లేదా తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటుంది. రాత్రి సమయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.
రక్తహీనత ఉన్నవారిలో కొన్నిసార్లు చాక్ పీసులు, బలపాలు, లవంగాలు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు లాంటి అసాధారణ పదార్థాలు తినాలని అనిపిస్తూ ఉంటుంది.
Related Web Stories
దీనిని రెగ్యులర్గా తీసుకుంటే పక్కాగా స్లిమ్ అవుతారు..
నోటి అల్సర్లను నయం చేసే సహజసిద్ధమైన చిట్కాలు ఇవే.. !
పనస గింజలే కదా అని పడేస్తే...! ఇక అంతే .
ఓపెనర్ లేకుండానే బీర్.. ఇలా ఓపెన్ చేయండి.!