తలనొప్పికి చాలా కారణాలు ఉండచ్చు. కానీ తలనొప్పి రిపీటెడ్ గా వస్తుంటే మాత్రం అది అధిక రక్తపోటుకు సంకేతమని వైద్యులు అంటున్నారు.
అధిక రక్తపోటు కళ్లలో రక్తనాళాలను దెబ్బ తీస్తుంది. ఇది కొన్ని సార్లు కంటిచూపు స్పష్టంగా లేకుండా, మరికొన్ని సార్లు ఒక వస్తువు రెండు సార్లు కనిపించేలా చేస్తుంది.
తరచుగా ముక్కు కారడం, ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటే అధిక రక్తపోటు ఉన్నట్టే.
హైపర్ టెన్షన్ గుండెను ఒత్తిడికి గురి చేస్తుంది. శరీరానికి అంతా రక్తాన్ని సరఫరా చేయడానికి కష్టం అవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
అధిక రక్తపోటు మెదడుతో సహా ముఖ్యమైన అవయవాలకు రక్తప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది అలసట, మైకానికి కారణం అవుతుంది.
నిద్రలేమి, కలత నిద్ర, నిద్ర మధ్యలో మెలకువ రావడం మొదలైనవి అధిక రక్తపోటుకు సంకేతాలు.
గుండె దడగా ఉండటం, గుండె కొట్టుకునే వేగంలో మార్పు ఉండే అధిక రక్తపోటు ఉన్నట్టే.
మానసిక స్థితి, ఏకాగ్రతలో మార్పులు, జ్ఞాపకశక్తి సరిగా లేకపోవడం వంటి కారణాలు కూడా అధిక రక్తపోటును సూచిస్తాయి.