టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

టీ చల్లగా అయిన తరువాత దాన్ని మళ్లీ వేడి చేసి తాగడం చాలామంది అలవాటు.  

టీని మళ్లీ వేడి చేస్తే అందులో టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి.  ఎక్కువ కాలం ఈ పద్దతి అనుసరిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది.

టీ ని మళ్లీ వేడి చేయడం వల్ల టీ రుచి కోల్పోతుంది.  వగరు,  చేదు రుచి ఉత్పత్తి అవుతుంది.

టీని మళ్ళీ వేడి చేస్తే అందులో రసాయన మార్పులు చోటు చేసుకుంటాయి.

టీని మళ్లీ వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు కోల్పోతాయి.

టీని మళ్ళీ మళ్లీ వేడి చేస్తే అందులో కెఫీన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఒక సారి టీని తయారు చేసి పక్కన ఉంచినప్పుడు  అందులో బ్యాక్టీరియా అభివృద్ది చెందుతుంది.  దీన్ని మళ్లీ వేడిచేస్తే బ్యాక్టీరియా ప్రమాదకంగా మారుతుంది.

మళ్లీ వేడి చేసిన టీలో ఆమ్ల గుణాలు పెరుగుతాయి.

టీని మళ్లీ వేడి చేసి తీసుకుంటే అది జీర్ణ సంబంధ సమస్యలు కలుగజేస్తుంది.

టీని మళ్ళీ వేడి చేస్తే దాని సువాసన పూర్తీగా మారిపోతుంది. ముఖ్యంగా మసాలా దినుసులు వేసి చేసిన టీ పూర్తీగా రుచి, వాసన మారిపోతాయి.

టీని మళ్లీ వేడి చేయడం వల్ల ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది.  ఇది టీ నాణ్యతను దెబ్బతీస్తుంది.