చిన్న వయసులోనే తెల్ల జుట్టా..   వీటితో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు!

పాలకూర  వెంట్రుకల మూలానికి ఆక్సిజన్ అందించగల, ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర జుట్టు తెల్లబడడాన్ని ఆపుతుంది.

ఉసిరి విటమిన్ సి, కొల్లాజిన్ ఎక్కువగా కలిగి ఉండే ఉసిరి కూడా జుట్టు తెల్లబడకుండా ఆపుతుంది.

వాల్‌నట్స్ బయోటిన్‌ను పుష్కలంగా కలిగి ఉండే వాల్‌నట్స్ వెంట్రుకల్ టిష్యూలను, సహజ రంగును కాపాడతాయి.

బాదం పప్పు కెరటిన్ ఉత్పత్తికి దోహదపడే బాదం పప్పులో బయోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. జుట్టు సహజ రంగును కాపాడడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది.

కరివేపాకు విటమిన్ బీ, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే కరివేపాకు జుట్టు తెల్లబడే ప్రక్రియను ఆపుతుంది.

నల్ల నువ్వులు ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండే నల్ల నువ్వులు మెలనిన్ ఉత్పత్తికి దోహదపడతాయి. జుట్టు నల్లగా ఉండడంలో మెలనిన్‌ది కీలక పాత్ర.

చిలగడ దుంపలు బీటా-కెరటిన్, విటమిన్-ఏ కలిగిన చిలగడ దుంపలు సెబమ్ ఉత్పత్తిని పెంచి జట్టు ఆరోగ్యం, రంగును కాపాడాతాయి.

క్యారెట్ బీటా-కెరటిన్‌తో పాటు పలు విటమిన్లను కలిగి ఉండే క్యారెట్ కూడా జట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.