చికెన్ బ్రెస్ట్..అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉండటం వల్ల చికెన్ బ్రెస్ట్ కండరాల దృఢత్వానికి సహాయపడుతుంది.
సాల్మన్..ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్-బి సమృద్దిగా ఉన్న సాల్మన్ ఫిష్ కండరాలను పునరుద్దించడంలో గొప్పగా సహాయపడుతుంది.
గుడ్లు..
గుడ్లలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, విటమిన్-బి12, కోలిన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు, కండరాల ఆరోగ్యానికి సహాయపడతాయి.
గ్రీక్ పెరుగు..
గ్రీక్ పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా కేసైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కండరాలకు అమైనో ఆమ్లాలను స్థిరంగా అందించడంలో సహాయపడుతుంది.
శనగలు..
శనగలు మంచి మొక్కల ఆధారిత ఆహారం. ఇందులో ఉండే కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్.. కండరాల మరమ్మత్తుకు చాలా సహాయపడతాయి.
క్వినోవా..
మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ప్రోటీన్ ఆహారం క్వినోవా. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, మొత్తం ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.