ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతే శరీరంలో కొన్ని లక్షణాలు కనబడతాయి. వాటిని చెక్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఇన్సులిన్ నిరోధకత పెరిగితే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరం మొత్తం సన్నగా ఉన్నా పొట్ట మాత్రం పెరుగుతుంది.
ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొంటున్న వారు ఎంతి తింటున్నా ఆకలి వేస్తూనే ఉంటుంది. గ్లూకోజ్‌ను శరీరంలోని కణాలు సమర్థంగా ఉపయోగించుకోకపోవడంతో ఈ సమస్య మొదలవుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల రక్తపోటు తీవ్రమవుతుంది. అలాగే రక్తంలో షుగర్ స్థాయులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి.
మెడ, నుదుటిపై చర్మం బాగా నల్లగా మారిపోతున్నా మీరు ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొంటున్నట్టుగానే భావించాలి.
మహిళల్లో క్రమ రహిత పీరియడ్స్‌కు కూడా ఇన్సులిన్ నిరోధకత ఓ కారణంగా మారుతుంది. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య మొదలవుతుంది.
ఇన్సులిన్ నిరోధకత వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు చుట్టుముడతాయి. కళ్లు మసకగా కనిపించడం కూడా ఉండవచ్చు.