చలికాలంలో బొప్పాయి తింటే కలిగే టాప్ 7 ప్రయోజనాలు ఇవీ..!
చలికాలంలో బొప్పాయి పండ్లు తప్పనిసరిగా తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
బొప్పాయిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచి సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.
పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని నియంత్రించడంలో అద్బుతంగా సహాయపడతాయి.
నీటి కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా బొప్పాయి తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.